Will the International Airlines Summit decide the future of Vijayawada airport?

Vijayawada Airport has begun its international journey greatly. Indigo launched its service to Singapore in December last year under the Viability Gap Funding initiative by the Government of Andhra Pradesh.

The Singapore service was also run very well with Almost 70% occupancy. But in June this year, Indigo cancelled this service bacause of the Andhra Pradesh government did not want to continue the VGF process.

Jet Airways, which has come forward to run its service to Dubai, is also in the midst of a financial crisis. so, uncertinity is there over dubai serivce.

On the other hand, there is a huge increase in passengers count . surprisingly, this year has already surpassed 10 million passenger movements .

At present, airliens operating services to only 8 cities in the country.Passengers want to start services to the Ahmedabad, Calcutta, Surat and Pune in the country and Rajahmundry, Kurnool in the state.

The airport administration, Andhra Pradesh aviation company and Andhra Pradesh government will jointly organising the International Airlines Summit in the third week of this month.

About 10 domestic and 48 international airlines are expected to attend the summit. The Summit will be useful to the Airports Authority of India to know the requirements that airlines need.

Moreover, if the government provides the necessary facilities to airlines, more new services are likely to be launched. So there is a great deal to be gained by this meeting.

With the AP Government and the Airport Administration resuming its overseas services and increasing domestic services, passenger traffic is likely to increase in the next year.

 

అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్ సమ్మిట్ విజయవాడ విమానాశ్రయం యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తుందా?

విజయవాడ విమానాశ్రయం తన అంతర్జాతీయ ప్రయాణాన్ని ఘనంగానే మొదలుపెట్టింది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చొరవతో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ పద్దతిలో ఇండిగో సంస్థ ఇక్కడ నుండి సింగపూర్ కు సర్వీసును గత సంవత్సరం డిసెంబర్ లో ప్రారంభించింది .

సింగపూర్ సర్వీసుకి ఆదరణ కూడా బాగానే ఉండేది . దాదాపు 70% ఆక్క్యుపెన్సీ తో నడిచేది. కానీ ఈ సంవత్సరం జూన్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజిఎఫ్ పద్దతిని కొనసాగించటానికి సుముఖత వ్యక్తం చేయకపోవటంతో అమరావతి నుండి విదేశాలకు నడుస్తున్న ఒకే ఒక సర్వీసును ఇండిగో సంస్థ రద్దు చేసుకుంది.

అంతేగాక దుబాయ్ కు సర్వీస్ నడపటానికి ముందుకు వచ్చిన జెట్ ఎయిర్వేస్ కూడా ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకు పోవటంతో ఈ సర్వీస్ కూడా సందిగ్ధంలో పడింది. దీంతో గన్నవరం నుండి విదేశాలకు ఒక్క సర్వీస్ కూడా లేకుండా పోయింది.

మరోవైపు ప్రయాణికుల సంఖ్య ఆశ్చర్యకర రీతిలో పెరుగుతున్న (ఈ సంవత్సరం ఇప్పటికే ప్రయాణికుల సంఖ్య 10 లక్షలు దాటిపోయింది ) రూట్ సర్వేలు, ఫీజిబిలిటీ స్టడీస్ , ఒపీనియన్ పోల్స్ అనుకూలంగా వున్నా ఒక్క సంస్థ విదేశాలకు విమానాలు నడపటానికి ముందుకు రావటం లేదు.

ప్రస్తుతానికి దేశంలోని 8 నగరాలకు మాత్రమే సర్వీసులు ఇక్కడ నుండి నడుస్తున్నాయి. పెరుగుతున్న రద్దీకి అనుగుణముగా సర్వీసులను పెంచాల్సి వుంది.

దేశంలోని మిగతా పెద్ద నగరాలైన అహ్మదాబాద్ , కలకత్తా, సూరత్ , పూణే నగరాలతో పాటు , రాష్ట్రంలోని రాజమండ్రి , కర్నూల్ లకు సర్వీసులని ప్రారంభించాలని ప్రయాణికులు కోరుకుంటున్నారు .

దీంతో ఎయిర్పోర్ట్ అడ్మినిస్ట్రేషన్, ఆంధ్ర ప్రదేశ్ ఏవియేషన్ సంస్థ , ఆంధ్ర గవర్మెంట్ సంయుక్తంగా ఈ నెల మూడవ వారంలో ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ సమ్మిట్ ని ఏర్పాటు చేయనుందని సమాచారం.

ఈ సమ్మిట్ కి దాదాపు 10 దేశీయ, 48 అంతర్జాతీయ విమాన సంస్థలు హాజరు కానున్నాయి. విమాన సంస్థలకు కావాల్సిన వసతులు , సౌకర్యాలు గురించి తెలుసుకోవటానికి ఈ సమ్మిట్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కు బాగా ఉపయోగపడుతుంది.

అంతేకాక విమానయాన సంస్థలకు కావలసిన వసతులను ప్రభుత్వం సమకూరిస్తే, మరిన్ని కొత్త సర్వీసులు ప్రారంభం అయ్యే అవకాశం వుంది. కాబట్టి ఈ సమావేశం ద్వారా ఎంతోకొంత ప్రయోజనమే చేకూరే అవకాశం వుంది .

ఏపీ గవర్మెంట్ , ఎయిర్పోర్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడ ఇక్కడి నుండి విదేశీ సర్వీసులను పునరుద్దరించటంతో పాటు , దేశీయ సర్వీసులను పెంచాలని కృతనిశ్చయంతో ఉండటంతో వచ్చే సంవత్సరంలో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం వుంది

Tags: , ,